కావలి మండలం ముసునూరులోని మర్రిచెట్టు సంఘం ఎస్టి కాలనీలో ప్రజలు రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వారికి భోజనాలు ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 250 మందికి టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.