నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్చార్జి మంత్రి యన్. ఎండి ఫరూక్ ఆదివారం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మంత్రి ఫరూక్ ను కలిసి సాలువ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొన్నారు.