ఫెంగల్ తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలు సామాన్య ప్రజలు, రైతుల బాధలను తీర్చిందో లేదో కానీ మూగజీవాల దాహార్తిని మాత్రం కచ్చితంగా తీర్చిందనే చెప్పాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు కుంటలు తోపాటు అడవుల మధ్యలో ఉన్న కుంటలు కూడా నిండడం మూగజీవాలకు ఓ వరం లా మారింది. ఇటీవల కొన్ని నెలల క్రితం విపరీతమైన ఎండలకు ఎక్కడా కూడా చుక్కనీరు లేకపోవడంతో మూగజీవాలమూగజీవాలు అల్లాడిపోయాయి. ఈ వర్షాలు వాటి దాహార్తిని తీర్చాయి.