
కావలి: 18 మద్యం బాటిల్లు స్వాధీనం
నెల్లూరు జిల్లా కావలి మండలంలోని సిరిపురం లో బెల్ట్ షాపులపై ఎక్సైజ్ ఎస్సై దేవిక ఆధ్వర్యంలో సిబ్బంది మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరుసు సుకుమార్, పరుసు సురేష్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 18 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవిక తెలిపారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు.