
వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే
బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకోట క్షేత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం గిరి ప్రదక్షణతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల తొలిరోజు గిరి ప్రదక్షణ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దగుమాటి క్రిష్ణారెడ్డి దంపతులు, ఆర్డీవో వంశీకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా ఏడు రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అన్నారు.