
కావలి: ఉద్యోగ భద్రత కల్పించాలి
రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కావలి డివిజనల్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసనకు దిగారు. 25 సంవత్సరాలగా చాలీచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ డి ఈ బెనర్జీకి వినతిపత్రం అందజేశారు.