తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం సమీపంలో ఇంద్రప్రస్థ ప్రాంగణంలో సంక్రాంతి సందర్భంగా సోమవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జబర్దస్త్ మహిళా టీమ్ వర్ష, శిరీష పాల్గొన్నారు. సందర్భంగా వారు ముగ్గులను పరిశీలించారు. అనంతరం ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి స్వప్న కైవసం చేసుకున్నారు.