ఘనంగా శ్రీ అంకమ్మ తల్లి గ్రామోత్సవం

1547చూసినవారు
విడవలూరు పట్టణంలోని శ్రీ అంకమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని విశేష పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, మంగళ వాయిద్యాలు, బాణాసంచాలతో అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

సంబంధిత పోస్ట్