నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయాన్ని మువ్వా చంద్రశేఖర్ ఐపీఎస్, ఆయన ధర్మపత్ని ప్రీతి సేలిహా సోమవారం దర్శించుకున్నారు. శ్రీ కామాక్షితాయి ఈ సందర్భంగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి అతిథులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అతిధులు ఆలయ ప్రదక్షిణం చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.