కోవూరు: ఎస్టీల సమస్యలపై ప్రత్యేక దృష్టి

77చూసినవారు
కోవూరు: ఎస్టీల సమస్యలపై ప్రత్యేక దృష్టి
షెడ్యూల్డ్ తరగతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు. శుక్రవారం విడవలూరు మండలం పార్లపల్లి ఎస్టీ కాలనీ, కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం ఎస్టి కాలనీ అధికారులతో కలసి సందర్శించారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్టీ మహిళల నుండి అర్జీలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్