ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మెన్ డాక్టర్ పి. క్రిష్ణయ్య, ఎంపి వేమిరెడ్డిని కలిశారు. పి సి బి చైర్మన్ హోదాలో తొలిసారిగా నెల్లూరు విచ్చేసిన క్రిష్ణయ్య వేమిరెడ్డి నివాసానికి విచ్చేసి నెల్లూరు ఎంపి, కోవూరు ఎమ్మెల్యేలైన వేమిరెడ్డి దంపతులతో పారిశ్రామిక అభివృద్ధి విషయాలపై చర్చించారు. కాలుష్య రహిత పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రస్తావించారు.