నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడి స్కూల్లు, కాలేజీలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. జిల్లాకు తుఫాన్ హెచ్చరిక ఉన్న నేపథ్యంలో సోమవారం జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడి స్కూలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. మంగళవారం తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నివేదిక అందజేసిన కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.