డంపింగ్ యార్డ్ లను తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ అధికారి

57చూసినవారు
నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ ఆదేశాల మేరకు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య రెడ్డి అల్లీపురంలోని టిడ్కో గృహ సముదాయాల ప్రాంగణం, డంపింగ్ యార్డులను శనివారం తనిఖీ చేశారు. అపార్టుమెంట్ గృహాల ప్రాంగణాలను ప్రతిఒక్కరూ బాధ్యతగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. అపార్టుమెంట్ పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా, దోమల నివారణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్