ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ మందా రాణి అనుచిత వ్యాఖ్యలు చేసి బెదిరించిన టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకీర్తి రవి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని ఐటిడిఏ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ గిరిజన మహిళా ఉద్యోగి పై సోమిరెడ్డి బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.