
నెల్లూరులో భారీ అగ్ని ప్రమాదం
నెల్లూరులోని వేదాయపాళెం పోలీసు స్టేషన్ సమీపంలో గల విక్రమ్ నగర్ లో శనివారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్ లో సీసీ కెమెరాలు తయారీ చేస్తున్న గదిలో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 40 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు యజమాని శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.