నెల్లూరు నడిబొడ్డులో చెత్త పేరుకుపోయింది. ఆర్టీసీ బస్టాండు వెనక వైపున ఉన్న అరవింద్ నగర్ లో గత 30 రోజుల నుంచి రోడ్లు చెత్తతో దర్శనమిస్తున్నాయి. ఈ విషయాన్ని పలువురు సంబంధిత మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు మంగళవారం ఆవేదన చెందుతున్నారు. రోజుల తరబడి చెత్త పేరుకోకపోవడం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తాయని వెంటనే రోడ్లపై దిబ్బలా ఉన్న చెత్తను తొలగించాలని కోరుతున్నారు.