రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ.. మండల, గ్రామస్థాయి అధికారులు తప్పని సరిగా వారి హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో రెండు రోజులు భారీవర్షాలు, గాలులు వీచే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.