పూర్వకాలం నుంచి వస్తున్న నియమ నిబంధనలను పాటిస్తేనే ఎవరికైనా తిరుమల ఆలయ ప్రవేశం ఉంటుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో మంత్రి ఆనం మాట్లాడుతూ తిరుమల ఆగమ శాస్త్రాలు, టిటిడి నిబంధనలను తప్పకుండా అమలుచేసి తీరుతామన్నారు అన్యమతస్థులు ఎవరైనా వెంకటేశ్వరస్వామిపై విశ్వాసం ఉందని, మత విశ్వాసాలను గౌరవిస్తున్నట్లు డిక్లరేషన్ ఇచ్చి మాత్రమే ఆలయంలోనికి ప్రవేశించాలన్నారు.