నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కోవూరు నియోజకవర్గంలో ఉన్న పాటూరులో స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు విన్నవించారు. మంగళవారం కేంద్రమంత్రి ఛాంబర్లో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ వేమిరెడ్డి ఈ సందర్భంగా ఆయన్ను శాలువాతో సత్కరించారు.