నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 182 మద్యం షాపులకు గాను 3872 అప్లికేషన్లు వచ్చాయి, జిల్లాలో 11 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మద్యం షాపుల కేటాయింపులో ఎటువంటి అవకతవకలు లేకుండా ఉండేందుకు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ స్వయంగా లాటరీలు ఎత్తుతూ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులతో పాటు పోలీసులు ఇతర ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు.