నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం అందజేశారు. 5 మంది బాధితులకు 5 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనలతో వివిధ ప్రాంతాల్లో బాధితుల ఇంటి వద్దకు వెళ్లి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని, చెక్కులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అందించారు.