జిల్లాలో సూక్ష్మ సేద్య పథకాల రాయితీలపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో సూక్ష్మ సేద్య పథక విధివిధానాలు, రాయితీల వివరాలను తెలియజేసే పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి పారుదల శాఖ పథకం క్రింద మంజూరైన పథకాల అన్నింటిని రైతులకు అందించాలన్నారు.