కార్మికులు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై ఈ నెల 26న జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. నెల్లూరు నగరంలోని డాక్టర్ శేషారెడ్డి విజ్ఞాన్ కేంద్రంలో శనివారం సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం చండ్ర రాజగోపాల్ అధ్యక్షతన జరిగినది.