నెల్లూరు నగరంలోని సదావరి పాలెం సెంటర్ లో శనివారం వన్ టౌన్ ఎక్సైజ్ ఎస్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పాపర్లపాటి రవి అను వ్యక్తి తన కూల్ డ్రింక్ షాప్ లో మద్యం విక్రయిస్తుండగా దాడి చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. నిబంధన విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ రమణయ్య, సిబంది పాల్గొన్నారు.