జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ శనివారం కలిశారు. నెల్లూరు నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ కృష్ణ కాంత్ ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్టి కమిషన్ సభ్యులు నాయక్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు, విచారణ జాప్యం పై ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు.