నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కృషి ఫలించింది. జిల్లాకు ఎంతో ప్రతిష్టాత్మకమైన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జనరల్ సర్జరీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌కు సంబంధించి ఆర్థోపెడిక్ 4, జనరల్ సర్జరీ 5 కొత్త సీట్లు కేటాయిస్తూ కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం ఈ మేరకు నెల్లూరు మెడికల్ కళాశాలకు సమాచారం అందించింది.