నెల్లూరు నగరంలో ఫిబ్రవరి 1వతేదిన ఇస్కాన్ సిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ బలరామ రథయాత్రను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ప్రతినిధి సుఖ్ దేవ్ స్వామి తెలియజేశారు. స్థానిక ఇస్కాన్ సిటీ లో సోమవారం రథయాత్రకు సంబంధించి వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఒకటో తారీకు మధ్యాహ్నం గం 2: 30 కు మూలాపేటలోని అలంకార్ సెంటర్ సమీపాన శ్రీ హనుమాన్ స్వామి విగ్రహం నుండి బయలుదేరి సర్వోదయ వరకు సాగుతుందన్నారు.