రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకుడు కే సురేష్ మోటార్ వాహన చట్ట సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాలలో జరిగిన వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లుతో రవాణా రంగ కార్మికులపై ఆర్థిక భారం పెరుగుతుందని తెలిపారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, లైసెన్సుల మంజూరును ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న ఆ బిల్లును రద్దు చేయాలని కోరారు.