రవాణా శాఖ అధికారులు ఏకపక్ష దాడులను నిరసిస్తూ నెల్లూరు నగరంలో టౌన్ బస్సులు తమ బస్సులను గత మూడు రోజులుగా నిలిపివేశారు. దీంతో నెల్లూరు నగరంలో వేలాది మందితో పాటు కోవూరు, కొత్తూరు, బుజబుజ నెల్లూరు, పడారరుపల్లి, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఇతర పరిసర ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే రోజువారి ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో లక్షల రూపాయలు జరిమానా విధించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.