వెంకటాచలం మండలంలోని కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో రాజనీతి మరియు ప్రభుత్వ పాలనా విభాగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివాస్) ను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం రాజ్యాంగ విధానం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు, రాజ్యాంగం పౌరులకు అందించిన హక్కులు, విధులపై విద్యార్థులకు ప్రజలకు వివరించే విధంగా నిర్వహించారు.