జిల్లాలో రాబోయే సోమవారం నాటికి ఇసుక ధరలు సాధారణ స్థితికి చేరుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో పి కె పాడు, మినగల్లు, ఇరువూరు, పల్లిపాడు ఇసుక రీచ్లల్లో కూలీల ఖర్చులు, లోడింగ్ చార్జీలు, రవాణా చార్జీలు తదితర పనులు చేయుటకు దాఖలైన టెండర్ల పరిశీలన జరిగింది.