నెల్లూరు: చివరి కార్తీక సోమవారం రోజున పోటెత్తిన భక్తులు

78చూసినవారు
నెల్లూరు: చివరి కార్తీక సోమవారం రోజున పోటెత్తిన భక్తులు
చివరి కార్తీక సోమవారం కావడంతో నెల్లూరులోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శివాలయాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు నదీ తీరాన దీపాలు వదిలారు. శివుని ఆరాధనకు చాలా ప్రత్యేకమైన రోజు గనుక తెల్లవారు నుండి శివుని దర్శించి అభిషేకాలు చేశారు. స్థానిక మూలాపేట శివాలయం వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.

.

సంబంధిత పోస్ట్