వైయస్సార్
కాంగ్రెస్ పార్టీ 42వ డివిజన్ ఇన్ చార్జ్ అబ్దుల్ మస్తాన్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను మెడికవర్ హాస్పిటల్ లో చేర్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గురువారం నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ కు చేరుకొని అబ్దుల్ మస్తాన్ ను పరామర్శించారు. మెరుగైన చికిత్స కోసం డాక్టర్ లు, హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకున్నారు.