నెల్లూరు నగరంలో జరిగిన తల్లీ, కుమార్తె జంట హత్యల కేసులో ఉరిశిక్ష పడి, ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న దోషి షేక్ ఇంతియాజ్ మానసిక పరిస్థితి, వ్యవహారశైలి, కుటుంబ నేపథ్యం, తదితర వివరాలను సమర్పించాలని హైకోర్టు శుక్రవారం జిల్లా కలెక్టర్, డీఎస్పీ, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్లను ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా ఈ కేసులో తదుపరి విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టంచేస్తూ విచారణను సెప్టెంబరు 6కి వాయిదా వేసింది.