నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ గాంధీనగర్ లింక్ రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో అటువైపుగా రాకపోకలు నిర్వహించే వాహన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిఎన్ టి రోడ్డును పొదలకూరు రోడ్డును కలిపే ఈ ప్రధానమైన రహదారి ఎంతో రద్దీగా ఉంటుంది. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోని రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు