నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాల ఎగువమిట్ట నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండా వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్దులు దేశభక్తి గేయాలు ఆలపించారు. విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, పంచాయితీ సెక్రటరీ మోహన్ రావు, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.