కేంద్రంలో పరిపాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని జిల్లా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు మోహన్ రావు విమర్శించారు. ఆదివారం సర్వేపల్లి మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సిపిఎం పార్టీ ఆరవ మండల మహాసభ జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శిగా గడ్డం అంకయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది.