వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలపై దుర్మార్గంగా కేసులు బనాయిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. నెల్లూరు నగరంలోని నివాసంలో శనివారం ఆయన మాట్లాడుతూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ అధినేత, వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా చేస్తున్న విష ప్రచారంపై జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లతామన్నారు.