కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు: మాజీ ఎమ్మెల్యే

82చూసినవారు
కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదు: మాజీ ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని సూళూరుపేట మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నాయకులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జిల్లాలో వైసీపీని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తామన్నారు. టిడిపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతుందని తెలిపారు. వైసిపి కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్