Dec 24, 2024, 11:12 IST/
తిరుమలలో తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం: TTD ఈవో
Dec 24, 2024, 11:12 IST
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో తక్కువ ధరకే మంచి, నాణ్యమైన ఆహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన మాట్లాడుతూ.. "దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. భక్తుల సంఖ్య పెరగడంతో అన్న ప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని, సరిపడా సిబ్బందిని నియమిస్తాం. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది." అని చెప్పారు.