AP: తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి ముందు జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని రెండ్రోజుల క్రితం ఆ పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తికి నోటీసులు ఇచ్చారు. తమ వద్ద ఎలాంటి సీసీ టీవీ ఫుటేజ్ లేదని నారాయణమూర్తి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై సీసీ కెమెరాల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.