ఆర్టీసీ బస్సు ఢీకొని చుక్కల దుప్పి మృతి

79చూసినవారు
ఆర్టీసీ బస్సు ఢీకొని చుక్కల దుప్పి మృతి
దుత్తలూరు మండలం కట్టకింద పల్లె గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పామూరు నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కట్టకింద పల్లె వద్దకు రాగానే అకస్మాత్తుగా రోడ్డుపైకి చుక్కల దుప్పి వచ్చి బస్సు ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దుప్పికి పంచనామా నిర్వహించి అడవుల్లో దహనం చేశారు.

సంబంధిత పోస్ట్