గత నాలుగు రోజుల నుంచి ఉదయగిరి బోయ వీధిలో విద్యుత్ సమస్యలు

63చూసినవారు
గత నాలుగు రోజుల నుంచి ఉదయగిరి బోయ వీధిలో విద్యుత్ సమస్యలు
ఉదయగిరి పట్టణంలోని బోయ వీధిలో గత నాలుగు రోజులు నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు సరఫరా లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి విద్యుత్ డబ్బులు తీసుకున్నప్పుడు కరెంటు ఇవ్వడం తెలియదా అంటూ విద్యుత్ శాఖ పై ఫైర్ అయ్యారు. మీడియా ముఖంగా వారు ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్