నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల వ్యాప్తంగా మంగళవారం ఉదయం నుంచి ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఈరోజు సంక్రాంతి పెద్ద పండుగ కావడంతో ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని ఆలయాలకు వెళ్లాలని అనుకునే ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. వాహనదారులు చిరు వ్యాపారస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా ఇటీవలే ఒక నెల క్రితం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.