తుఫాను కారణంగా వింజమూరు మండల కేంద్రంలోని గనపం బాలకృష్ణారెడ్డి ఎస్టీ కాలనీలోని ప్రాధమిక పాఠశాలకు తరలించిన తుఫాన్ బాధితులకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాకర్ల సురేష్ మంగళవారం 50 దుప్పట్లను పంపిణీ చేయడంతో పాటు వారికి భోజన సదుపాయాలకు సైతం హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ శ్రీమతి ఇండ్ల భవాని, టిడిపి నాయకులు పాల్గొన్నారు.