ఉత్తరాఖండ్‌లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ నుంచి చక్రతా సందర్శనకు బయలుదేరిన ఐదుగురు యువ పర్యాటకుల కారు లోఖండి సమీపంలోని 200 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కరణ్ రావత్ (24) మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు రక్షించి సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.