కలిగిరి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. కలిగిరి పట్టణంలోని మల్లితోటకు మట్టి రోడ్డు కావడంతో.. మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి చాలా దారుణంగా మారింది. వాహనాలు ఎక్కువగా తిరగడంతో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. పాదాచారులు అటు నుంచి వెళ్లాలంటే జంకుతున్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.