కలిగిరి: ఈ రోడ్డులో వెళితే వాహనాలు ఇరుక్కుపోతాయి

51చూసినవారు
నెల్లూరు జిల్లా కలిగిరి మండలం చీమల వారి పాలెం నుండి ఏఎస్ పేట మండలం రంగన్నపాడు ఫారెస్ట్ వరకు వెళ్లే రెండు కిలోమీటర్ల దూరం రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా అద్వానంగా ఉంది. వర్షాలు పడితే ఈ మార్గంలో వెళ్లాలంటే వాహనాలు ఇరుక్కుపోతాయని ప్రజలు భయపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకొని ఈ రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరారు. ఈ మార్గం పూర్తయితే అబ్బాసాపేట, కొత్తపల్లి, రంగన్నపాడు, గుడిపాడు రవాణా సౌకర్యం కలుగుతుంది.

సంబంధిత పోస్ట్