కొండాపురం మండలం నేకునాంపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు శుక్రవారం జరిగింది. పలు భూ సమస్యలపై గ్రామస్తుల నుంచి తహసిల్దార్ కోటేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీకి పరిష్కారం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులను తహసిల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి దామా మహేష్ పాల్గొన్నారు.