నర్రవాడలో గోసంరక్షణకు చర్యలు

355చూసినవారు
నర్రవాడలో గోసంరక్షణకు చర్యలు
దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి గోశాలను దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ శ్రీనివాసరావు పరిశీలించారు. గోశాల ప్రాంగణంలో పచ్చిగడ్డి పెంచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆసక్తి కలిగిన రైతులకు గోవులు, కోడెలను దత్తతకు ఇవ్వాలన్నారు. గోవులకు, కోడె దూడలకు టీకాలు వేయడంతో పాటు దాణా అందించే విషయమై పశువైద్యాధికారితో చర్చించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్